Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుకవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ.. వాయిదా

కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ.. వాయిదా

ఢిల్లీ:ఈడీ సమన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే, గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు రికార్డులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణను వాయిదా వేసింది.ఈ నెల 16న విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం తెలిపింది. గత విచారణలో కవిత పిటిషన్ ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత సమన్లు తీసుకోవడం లేదని, విచారణకు రావడం లేదని ఈడీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని ఈ సందర్భంగా కపిల్‌ సిబల్‌ అన్నారు.ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, అది కేవలం ఒకసారికి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article