కదిరి :వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుకు కష్టపడి పనిచేసి వైసీపీని గెలిపించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకులను ఆదేశించారు. శనివారం ఉదయం కదిరి మీదుగా అనంతపురం వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు కదిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ పట్టణంలోని మొటుకుపల్లి వద్ద ఘనంగా స్వాగతం పలికారు. కదిరి రాజకీయాల గురించి కాసేపు ముచ్చటించారు. ఈసారి కూడా రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి, ప్రభుత్వ పథకాలు గురించి అందరికీ తెలియజెప్పాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసులు రెడ్డి, మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్, మాజీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ నజీమున్నీసా సాదిక్, మైనార్టీ నాయకులు సాదత్, వైఎస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ జిలాన్, లింగాల లోకేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్లు అజ్జుకుంటి రాజశేఖర్ రెడ్డి, గంగాదేవి, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.