-మొక్కలకు అంట్లు కట్టె కార్యక్రమం
- 25 వ తేదీ ఉదయం 10 గంటల నుండి సింహాచలం గోశాలలో శిక్షణ
- ఇంటి వద్ద పంటలు పండించే వారికి నిపుణులతో శిక్షణ
- అమృత పంటలను పండించడం ద్వారా ఆరోగ్యం పొందండి
- దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, అధ్యక్షుడు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం
విశాఖ:
కూరగాయ మొక్కలకు అంట్లు కట్టె కార్యక్రమానికి రావాలని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం శివాజీ పాలెం లోని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25 వ తేదీ ఉదయం 10 గంటల నుండి సింహాచలం గోశాలలో (జైలు రోడ్డు లోని) శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఇంటి వద్ద కూరగాయల పంటలు పండించే వారికి నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని, ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ఇంటి వద్ద, ఇంటి పైన పంటలు పండించే వారంతా ఈకార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొంది ఆరోగ్యం ఇచ్చే అమృత ఆహారం పండించు కోవాలని, తద్వారా ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటి దగ్గర ఆరోగ్య కరమైన ఆహారం కోసం ఆహార పంటలు పండించడం అవసరం అన్నారు. రసాయన ఎరువులు రసాయన క్రిమి సంహారకాలు లేకుండా ఎవరి ఇంటికి కావలసిన కూరగాయలు ఇంటి వద్ద పండించు కోవాలని కోరారు. సంస్థ కార్యదర్శి పాలెం నేచురల్స్ అశోక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు వాట్సాప్ ద్వారా వారి పేరు, వివరాలు 9866138129, 9966651052 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు.