రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత.
కేంద్రకారాగారము లో ఖైదీల ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్పస్ నిధులతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. ధవారం స్థానిక కేంద్ర కారాగారము డిఐజి కార్యాలయం సమీపంలో రు.50 లక్షల రూపాయలతో ప్రాంతీయ శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత, ఎంపి మార్గాని భరత్ రామ్, జైళ్ల అధికారులతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల శాఖలో 17 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి, ఖైదీల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఒక్కొక్క ఖైదీకి రోజుకి 200 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సుమారు నెలకు 12 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.సెంట్రల్ జైలు సమీపంలో 60 ఎకరాల విస్తీర్ణంలో రు. 50 లక్షల రూ పాయలతో నిర్మించనున్న ప్రాంతీయ శిక్షణ కేంద్రము ఏర్పాటు చేస్తున్నమన్నారు. ఈ రోజు శంకు స్థాపనలుచేడుతున్న వాటిలో ఒకటి పెట్రోల్ బంకు కాగా మరొకటి ప్రాంతీయ శిక్షణ కేంద్రం అన్నారు. జైలు శాఖ కార్పస్ నిధులతో ఇండియన్ ఆయిల్ మరియు హెచ్ పి ఎల్ సంస్థల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు ఉద్యోగం చేసేందుకు పెట్రోల్ బంకులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పెట్రోల్ బంక్ నుంచి వచ్చే ఆదాయము కార్పస్ ఫండ్ కు జమ చేయడమే కాకుండా జైలు అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా నేడు 60 ఎకరాల్లో రు. 50 లక్షల రూపాయలతో నిర్మించిన జైళ్లు శాఖ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణము కొరకు నిధులు రెండవ దశలో మరికొన్ని నిధు లు సమకూర్చడం జరుగుతుం దన్నారు. జైళ్లు లో పనిచేసే సిబ్బంది కి ఇప్పటికే శిక్షణ అందిస్తున్నామని, వీరికి ప్రత్యేకమైన శిక్షణ కేంద్రం ఉండాలని లక్ష్యంతో ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఖైదీలుగా జైలుకు వస్తుంటారని వారి యొక్క మానసిక పరిస్థితులను అర్థం చేసుకొని వారిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొనే విధంగా జైలు సిబ్బందికి శిక్షణ అందించడం జరుగుతుందన్నా రు.ఈ కార్యక్రమంలో
ఎంపి మార్గాని భరత్ రామ్, డిసిసిబి ఛైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ & డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ & కరెక్షనల్ సర్వీసెస్స్, హరీష్ కుమార్ గుప్తా, ఇస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ ఇస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఐ.శ్రీనివాసరావు, డిఐజి (కోస్తాంధ్ర ప్రాంతం) యం. ఆర్.రవి కిరణ్, సూపరింటెం డెంట్ ఆఫ్ జైల్స్, ఎస్. రాహుల్ఆఫ్ పోలీస్, జిల్లా ఎస్.పి. జగ దీశ్ తదితరులు పాల్గొన్నారు.