Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుకేంద్ర ప్రభుత్వ పథకాలపై వీధి సభల ద్వారా ప్రచారం

కేంద్ర ప్రభుత్వ పథకాలపై వీధి సభల ద్వారా ప్రచారం

ఏలేశ్వరం:- కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఉద్దేశంతో పల్లెల్లో వీధి సభలు నిర్వహించి ఆంధ్రలో ఒక్కసారి,కేంద్రంలో మరొక్కసారి సర్కార్ కి అవకాశం కల్పించాలని బీజేపీ శ్రేణులు ప్రచారం చేశారు. మండలం సిరిపురం గ్రామం లో మండల అధ్యక్షులు కూరాకుల రాజా ఆధ్వర్యం లో బీజేపీ నేతలు వీధి సభలు నిర్వహించి కేంద్ర పథకాలు ప్రచారం చేసి , ఆంధ్రా లో కేంద్రం లో డబుల్ ఇంజన్ సర్కార్ కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు మద్దతు ఇవ్వాలని నియోజక వర్గ కో కన్వీనర్ దాకే కృష్ణారావు కోరారు. దేశంలో ప్రధాని మోడీ అవినీతి లేని పరిపాలనకు సాగిస్తూ,పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని,ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా కోటి ఇళ్లపై 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్ ,కిలో 29 రు. లకే భారత్ రైస్ 5,10 కేజీల బ్యాగులను అందరికీ అందుబాటులోకి తెస్తున్నట్లు జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఏలేశ్వరం పట్టణ అధ్యక్షుడు రెడ్డి లోవరాజు,ప్రత్తిపాడు మండల అధ్యక్షులు కంద వీరాస్వామి , జిల్లా సైనిక్ సెల్ కన్వీనర్ కర్రి ధర్మరాజు,గోగుల అఖిల్,లింగం దుర్గ , సాపసెట్టి లోవరాజు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article