మార్కాపురం
పట్నంలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC )వారు విడుదల చేసిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎండీఎస్) ఫేజ్-2 ఫలితాలలో మార్కాపురం పట్టణం లోని నేతాజీ ఇన్స్టిట్యూట్ అఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ( NICE ) నందు శిక్షణ పొందిన దూదేకుల ఖాదర్ వలి ఎంటిఎస్ఉద్యోగానికి ఎంపికైనట్లు నేతాజీ ఇన్స్టిట్యూట్ గౌరవ సలహాదారులు
కొత్తేర్వ కాశీరెడ్డి తెలిపారు. కేవలం ఒక సంవత్సర వ్యవధి లో ఖాదర్ వలి కి ఇది మూడో ప్రభుత్వ ఉద్యోగం కావడం గమనార్హం.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగం సాధించిన ఖాదర్ వలి మాట్లాడుతూ పట్టుదలతో చేసిన ప్రయత్నం, దానికి వెన్నుదన్ను గా ఉన్న నేతాజీ ఇన్స్టిట్యూట్ అధ్యాపక బృందం వల్లనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఇన్స్టిట్యూట్ అధ్యాపక బృందం తారక్, శేషు, రమణారెడ్డి, గౌతమ్, వీరభద్రారెడ్డి, ఫణి కుమార్, ఫణింద్రారెడ్డి మరియు విద్యార్థులు విజేతకి అభినందనలు తెలిపారు