గాజువాక:
కేంద్రీయ విద్యాలయం మూసివేత ప్రతిపాదన తక్షణం విరమించుకోవాలని 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు డిమాండ్ చేశారు. నేడు స్టీల్స్ సిఐటియు మరియు మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఉక్కున గరం కేంద్రీయ విద్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాను నుద్దేశించి డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బయట ప్రచారంలో ఒకరకంగానూ ఆచరణలో వేరొకరకంగానూ వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. నిర్వాసితులు, ఉక్కు ఉద్యోగుల పిల్లలకు విద్య అందించాల్సిన ప్రధాన బాధ్యతనుండి యాజమాన్యం తప్పుకోవడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. కనుక ఇటువంటి ప్రతిపాదనలను యాజమాన్యం తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ మా ట్లాడు తూ దీనిని 1983లో ప్రారంభించారని నేడు దీనిలో 1050 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని ఆయన అన్నారు. వీరి భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చే యాజ మాన్య వైఖరి అత్యంత దుర్మార్గమని ఆయన వివరించారు. దీనికి నేటి వరకు యాజమాన్యం అందిస్తున్న ఆర్థిక మరియు సహాయ సహకారాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ దీనిలో క్లాస్ 1 మరియు 11 తరగతిలో రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ఇవ్వట్లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల సంఖ్య ఒక సెక్షన్ కు 40 కి మించరాదని కానీ నేడు అది 80 వరకు ఉందని ఆయన అన్నారు. అలాగే నాణ్యమైన విద్యు లభిస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు ఇక్కడ తమ పిల్లలను జేర్పిస్తున్నారని, కానీ నేడు ఆ విద్యను బోధించే ఉపాధ్యాయులు కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఈ చర్యల ద్వారా విద్యార్థులు దీనిపై విశ్వాసాన్ని కోల్పోతారని ఆయన వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చర్యలను ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరిం చారు. స్టీల్ సీఐటీయూ అధ్యక్షులు వై టి దాస్, మిత్రపక్షాల నాయకులు డివి రమణా రెడ్డి, శ్రీనివాస్ మాట్లాడుతూ యాజమాన్యం పిల్లల భవిష్యత్తుతో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపా రానికి దిగరాదని వారు తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యలను తక్షణం విరమించుకొని యధాస్థి తిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు ప్రతినిధులు మొహిద్దిన్, మహేష్, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు నవ్య, జ్యోతి, పద్మావతి, హేమ, వినీల, తారకేష్, ప్రసాద్, ప్రదీప్, భాస్కర్, సత్యానంద, ప్రతాప్తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.