న్యూఢిల్లీ:ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులపై మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దాడులు చేసింది. మంగళవారం ఉదయం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ సహా ఆప్తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్, ఢిల్లీ జలబోర్డు మాజీ సభ్యుడు శలభ్‌కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి N.D.గుప్తా కార్యాలయంతోపాటు మరికొందరు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది.మరోవైపు ఈడీ దాడులపై మంత్రి అతిషి దుయ్యబట్టారు. గత రెండేళ్లుగా ఆప్ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని … ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పాలంటూ ఆప్ నేతలను ఈడీ బెదిరిస్తోందని ఆరోపించారు.