కేంద్రం పరోక్ష భరోస ఇచ్చినట్లేనా
2018 రిపీట్ అవుతుందా
రైతుబందుతో ఇక కారు రైట్ రైట్ నా
ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తో కాంగ్రేస్ కు గుబులు పుట్టే నా
(ఏ రామమోహన్ రెడ్డి,సీనియర్ పాత్రికేయులు)
సమర శంఖారానికి ఇక ముచ్చటగా ఇక మూడు దినాల తరువాత ఓట్ల ముచ్చట మొదలుకాబోతుండగా ఎలక్షన్ కమిషన్ రైతు బందు పథక నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం తో జోరుగా ఉన్న కారు రయ్ రయ్ మంటూ మరింత హుషారుగా పరుగులు పెడుతూ ప్రజల్లో తమ పార్టీ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తూ మొదటి నుంచి ఎదయితే చెబుతూ వస్తున్నవిదంగా విపక్ష పార్టీల పై దుమ్మెత్తి పోస్తున్నారు. 2023 ఎన్నికల శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు ప్రధాన ఆయుధం రైతుబందు,దరిణి, దళిత బందు ఈ మూడు అస్త్రాలను సందిస్తూ ఇప్పటివరకు జరిగిన,జరగబోతున్న ప్రజాశీర్వాద సభలలో పదే పదే చెప్పుకొస్తూ ప్రజలలో చైతన్యం కలిగిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పై మోడీ పాలన పై పాక్షిక విమర్శలు చేస్తూ ప్రచారం దూసుకెళ్తున్నారు.అయితే అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపి తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఆ పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో ప్రజలను మెప్పించకపొగ ముఖ్యమంత్రి పీఠం పై ప్రసంగాలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఇక బీజేపీ ప్రచారం ఉందంటే ఉన్నట్లుగా సాగుతోంది. జనసేనతో పొత్తు ఉన్న కేంద్ర పెద్దలు భారీ స్థాయిలో వచ్చి సభలు నిర్వహిస్తున్న ఆ ప్రసంగాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పదేండ్ల పరిపాలన లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ ని జైలుకు పంపుతామని జాతీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు పసలేనివిగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పై ఈడీ కేసు ఉన్న ఇప్పటి వరకు ఆమెను ఏమి చేసింది లేదు.ఇక ఇక్కడ రాని ప్రభుత్వం ను ఉహించు కొని కేసీఆర్ ను జైలుకు పంపుతామంటే చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లుగా ఉంది మరి. ఇక ఇవన్నీ ప్రక్కన బెడితే ఓటు ఈ నెల 30 తేదీ వేయబోతుండగా రైతుబందు నిధులు విడుదల చెస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేయడంతో కేసీఆర్ గెలుపు ఖాయమైనదని బీఆర్ఎస్ శ్రేణులు ఆనందోత్సాహాలతో నిండిపోతున్నారు.ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కుర్చీలాటలతోనే కుస్తీ బడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలకయిన సిఫ్డమవుతుందేమో చూడాలి మరి.