కోడిగుడ్లు ప్రోటీన్ లకు చక్కటి మూలం మన శరీరంలో కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు అనేది అత్యవసరం. డయాబెటిక్ పేషెంట్లు సైతం కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉండే అన్నం, చపాతీలకు బదులుగా కోడిగుడ్లను తినమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. . అయితే కోడిగుడ్లు తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ లో ఉంచిన కోడిగుడ్లను ఎక్కువగా తినకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. మటన్,చికెన్ కన్నా ఈ వెజిటేరియన్ ఫుడ్స్‌లో అధిక ప్రోటీన్ లభిస్తోంది..అవేంటో మీరు ఓ లుక్కేయండి రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన గుడ్లను ఎందుకు తినకూడదో తెలుసుకుందాం. గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటిని సురక్షితంగా ఉంచగలమని అందరూ అనుకుంటారు. అయితే గుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పోషకాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు రిఫ్రిజిరేటర్ లో కోడిగుడ్లను ఉంచడం వల్ల వాటిపై ఉన్నటువంటి పెంకు భాగము గడ్డకట్టే ప్రమాదం ఉంది అలాంటప్పుడు దాని లోపల ఉన్నటువంటి పదార్థంలో టాక్సిన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. రిఫ్రిజిరేటర్ లో కోడిగుడ్లను రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంచినట్లయితే ఆ కోడిగుడ్లను తినకుండా ఉండటం మంచిది.