Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుగడప గడపలో జగనన్నపై వెల్లువెత్తిన అభిమానం: చెవిరెడ్డి హర్షిత రెడ్డి..!

గడప గడపలో జగనన్నపై వెల్లువెత్తిన అభిమానం: చెవిరెడ్డి హర్షిత రెడ్డి..!

  • ఎమ్మెల్యే చెవిరెడ్డి పార్టీలకు అతీతంగా సాయం చేశారని కితాబు..
  • చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరిస్తామని మాట ఇచ్చిన స్థానికులు ..

చంద్రగిరి
కులం , మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడా లేకుండా ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన మేలుతో జనం నుంచి ఆయన బిడ్డ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తప్పకుండా సాయం చేస్తామని అక్కడి మహిళలు మాట ఇచ్చారు. చంద్రగిరి మండలం చిన్న రామాపురం పంచాయతీ, భీమవరం హరిజనవాడ, చిన్న రామాపురం, కందుల వారి పల్లి పంచాయతీ పాత పాటివారిపల్లి, బి.కొంగర వారి పల్లి గ్రామాల్లో శుక్రవారం చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు గురించి ప్రతి గడపలో వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అర్హతే ప్రామాణికంగా లబ్దిదారులు అందరికీ సంక్షేమ పథకాలు చేరువ చేసిన సంక్షేమ సారథి జగనన్న ప్రభుత్వంను స్థానిక ప్రజలు స్వాగతించారు. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ముందుండి సాయం చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి సేవలను ఎన్నటికీ మరవబోమని స్థానిక మహిళలు తమకు జరిగిన మేలును గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపట్ల అన్ని కాలనీల వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డి విజయానికి కష్టపడి పనిచేస్తామని అక్కడి యువత ముందుకు వచ్చి జేజేలు పలికారు.
సమస్యలు వింటూ.. పరిష్కారం చేస్తూ..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి స్థానిక ప్రజలతో మమేకమై అక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని తన వెంట వచ్చిన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article