అమరావతి:“శాసనమండలి తరుపున టీడీపీ సభ్యులందరం సభకు హాజరై గవర్నర్ ప్రసంగం విన్నాం. గవర్నర్ వ్యవస్థను ఈ ముఖ్యమంత్రి ఏవిధంగా దుర్విని యోగం చేశాడు.. ఎంతగా అపహాస్యం చేశాడో నేటి గవర్నర్ ప్రసంగమే నిదర్శన మని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు అన్నారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అన్నీ అబద్ధాలు చెబుతుంటే, ముఖ్యమంత్రేమో ఏదో సాధించినట్టు బల్లలు చరుస్తున్నాడు. ముఖ్యమంత్రి ఈ విధంగా ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. బడ్జెట్ సమావేశాలు అంటే 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలోని తెలుగువారు కూడా ఆసక్తిగా గమనిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో చెప్పించిన అబద్ధాలు విన్నాక అందరూ కిందపడి గిలగిల కొట్టుకునే పరిస్థితి. బరితెగించి అవాస్తవాలు చెబుతున్నారనే తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేటి సమావేశాల్ని బాయ్ కాట్ చేసిందిఏ ప్రభుత్వమైన విద్య, వైద్యరంగాలను ప్రోత్సహిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాథమికవిద్యను లేకుండా చేసింది. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యా ర్థులే దేశంలో చాలాతక్కువ ప్రతిభ చూపారు. ఎక్కువ మంది ఉత్తీర్ణులైతే తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర సౌకర్యాలు ఇవ్వాల్సి వస్తుందనే జగన్ ఇలా చేశాడు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అన్నాడు. 5వ జనవరి కూడా పోయింది.. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ తీసుకొచ్చి, ఒక్క ఉద్యోగం ఇచ్చిందిలేదు. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. గవర్నర్ తో ముఖ్యమంత్రి 127 పాయింట్లను 134పేజీల పుస్తకాన్ని ప్రజల కోసం చదివించే ప్రయత్నం చేశారు. శాసనసభ సాక్షిగా వ్యవస్థల్ని దుర్విని యోగం చేసింది కాక, బరితెగించి అవాస్తవాలు చెప్పడంతో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం సమావేశాల్ని బాయ్ కాట్ చేసింది. తర్వాతి రోజుల్లో సమా వేశాల్లోవాస్తవాల్ని ప్రజలముందు ఉంచే ప్రయత్నంచేస్తాం.” అని బీ.టీ.నాయుడు తెలిపారు.