గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం వినీత్‌సింగ్ నివాసంలోనూ , ఆయన కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడి చేశారు… ఆయన తో పాటు డీఎఫ్‌ఎం ప్రదీప్ బాబు, రైల్వే ఉద్యోగులు రాజు, ప్రసాద్, బాలాజీల ఇంటిపై కూడా సిబిఐ అధికారులు గత మూడు రోజులుగా సోదాలు చేపట్టగా అవి నేటితో ముగిశాయి.. ఈ సోదాలలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. దీంతో మొత్తం 8 మంది సిబ్బందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఆర్‌ఎం వినీత్‌సింగ్, డీఎఫ్‌ఎం ప్రదీప్ బాబు, సిబ్బంది రాజు, ప్రసాద్, బాలాజీ లను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు.. గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలో భాగమైన ఆర్థిక విభాగంలో సికింద్రాబాద్‌కు చెందిన సీబీఐ అధికారులు గురువారం నుంచి వరుస సోదాలు నిర్వహించారు.. ఈ సోదాలు నేటి ఉదయం ముగిసాయి. ఆర్థిక విభాగంలో పని చేస్తున్న సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్(డీఎఫ్‌ఎం) ప్రదీప్‌బాబుతో పాటు మరికొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు గత మూడు రోజుల నుంచి గుంతకల్లులో మకాం వేశారు. కదిరి ప్రాంతంలో రైల్వే మోరీ పనులకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన గుత్తేదారులకు పనిని అప్పగించడానికి ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రదీప్‌బాబుతో పాటు కొందరు సిబ్బంది డబ్బును డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిని ఆధారం చేసుకుని సోదాలు నిర్వహించగా పెద్ద ఎత్తున నగదు, బంగారం వారి వద్ద లభించింది.. దీంతో డిఆర్ఎం తో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.