లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షి లోని శాఖ గ్రంథాలయంలో జూన్ ఏడవ తేదీ వరకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు గ్రంథాలయ శాఖ అధికారి జయసింహరాజు తెలిపారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థులకు పుస్తక పఠనం, కథలు చెప్పడం, కథలను చదివించడం, పుస్తకాలపై సమీక్ష ,చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లీష్, కవితలు ,సులభంగా లెక్కలు నేర్పించడం ,నృత్యాలు, చదరంగం, యోగా ,క్యారమ్స్ మొదలైన వాటిలో శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొనట్లు గ్రంథాలయశాఖ అధికారి జయసింహారాజు తెలిపారు.