వనిత మ్యాచింగ్ సెంటర్ బాబు ఆధ్వర్యంలో కడప టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని మాధవి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం
కడప సిటీ :
కడప నగరంలో R. K. స్రీట్ శ్రీరాములు బజార్ లో వనిత మ్యాచింగ్ సెంటర్ బాబు ఆధ్వర్యంలో రామాలయం లో కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవి రెడ్డిని,పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డిని, హరిప్రసాద్ని, గోవర్ధన్ రెడ్డిని జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెన్నం శెట్టి.మురళీకృష్ణ, నగర అధ్యక్షులు శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
చెన్నం శెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ కడప క్లాత్ మర్చంట్కు రామారావు టైంలో నుంచి కూడా టిడిపి ప్రభుత్వం చాలా అండదండలుగా ఉంటూ కడప నగరంలో క్లాత్ బిజినెస్ వ్యాపారస్తులు అన్ని విధాల ఎదుగుదలకు తోడ్పడిందని ఆయన అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు హాయంలో కూడా టిడిపి ప్రభుత్వం క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కి అండదండలుగా ఉంది. గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే యొక్క ఆగడాలు తట్టుకోలేక, ఈ ప్రభుత్వాలు ఏసేటట్టు ఉంటి వ్యాట్,జిఎస్టి టాక్స్ లని భరాయించలేకకొంటుబడినటువంటి క్లాత్ మర్చంట్ ను, మల్ల పూర్వం టిడిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి క్లాత్ మర్చంట్ వైభవాన్ని తీసుకురావాలంటే, మన వ్యాపారస్తులు గాని, ప్రజానికంగాని, మన నియోజకవర్గ ఓటర్ మహా దేవుళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, మాధవరెడ్డిని గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో బోర్డుకు పన్ను ట్రేడ్ లైసెన్స్, చెత్త పన్నుతో పాటు అనేక విధాలుగా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి,వాలంటీర్లు రౌడీయిజంగా పన్నులు వసూలు చేశారని డిప్యూటీ సీఎం దృష్టికి మేయర్ దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగలేదని. అలాగే మున్సిపల్ పన్నులు ప్రతి రూమ్ కు సంవత్సరానికి 15% పెంచారని అందుచేతనే వైసిపికి వ్యాపారస్తులు ఎవరు కూడా ఓటు వెయ్యకూడదని తీర్మానం చేశారు, వ్యాపారస్తులో తెలుగుదేశం పార్టీకి అపూర్వ స్పంధన వచ్చిందని చెన్నంశెట్టి మురళీకృష్ణ అన్నారు, అలాగే ఆర్కేఎం స్ట్రీట్,బికేఎం స్ట్రీట్ లలో ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు.