-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాతిదూలం లాగుడు పోటీలు
రాప్తాడు ;మండల పరిధిలోని ప్రసన్న పల్లి పంచాయతీలోని అయ్యవారిపల్లి గ్రామంలో భక్తుల కోరికలు తీర్చే ఎర్రి స్వామి తాత ఉట్ల పరుస ను కాలువ గుంచి, గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున నుండే స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల కోరికలు తీర్చే దేవుడా ఎర్రి స్వామి తాత అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు ఈ పరుసకు జిల్లా నలుమూలల నుండి భక్తాదులు వచ్చి మొక్కలు తీర్చుకుంటారని తెలిపారు అనంతరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహించారు మొదటి బహుమతి 25 వేల రూపాయలను బెలుగుప్ప మండలం గంగవరం కు చెందిన కాన్ల యజమానులకు కామగుండ రామాంజనేయులు అందించారు. రెండవ బహుమతి 20వేల రూపాయలను గంజి ప్రసాద్ అందించారు . మూడో బహుమతి 15 వేల రూపాయలను తలారి రోగప్ప అందించారు. నాలుగవ బహుమతి పదివేల రూపాయలను చాకలి నాగరాజు అందించారు. అదేవిధంగా ప్రసన్నపల్లి భూమిరెడ్డి మహానంద రెడ్డి భక్తులకు నిత్య అన్నదానాన్ని కల్పించారు . అనంతరం సాయంత్ర సమయంలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తొలగించడానికి వేలాదిమందిగా భక్తులు ప్రజలు తరలివచ్చారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు .