హిందూపురం టౌన్
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ వైస్ చైర్మన్ బలరామిరెడ్డిలు పేర్కొన్నారు
జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం హిందూపురం మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డు లో బుధవారం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్, మాట్లాడుతూ పేదవాడి ఇంటి వద్దకే వైద్యం అందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష మొదట విడతలో ఎంతోమంది లబ్ధి పొందారని, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు ప్రజలందరికీ ఆరోగ్యం అందించిన ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇలాంటి పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని వారు కోరారు. అనంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్, శాంతి ,నాయకులు ,సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు,కార్యకర్తలు, ఆశ వర్కర్లు , సచివాలయం సిబ్బంది, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు*.