Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుజగనన్న కార్యక్రమం కు స్పందన అంతంత మాత్రమే

జగనన్న కార్యక్రమం కు స్పందన అంతంత మాత్రమే

ప్రజాభూమి వరదయ్యపాలెం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు డాష్ బోర్డు ఆవిష్కరణ కార్యక్రమంకు తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలం, ఇందిరానగర్ సచివాలయం నందు స్పందన అతంతమాత్రమే కనిపించింది.33 రకాలు సంక్షేమ పథకాలు ద్వారా ₹16,60,18,195/-అందించినప్పటికీ, కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజేప్పి,రప్పించడం లో అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలం అయ్యారని స్పష్టంగా అర్ధం అయింది.కార్యక్రమం ఆరంభ సమయం షెడ్యూల్ మండలం అంతటా కూడా ముందుగా తెలియజేసినప్పటికి,ఎక్కడ సమావేశం నిర్వహించాలో నిర్ణయం తీసుకోలేని అధికారుల పనితీరుతో, కేవలం రెండు గంటల ముందు గ్రామస్థులకు తెలియపరచడంతో ప్రజల నుండి పెద్దగా స్పందన లేదు.అధికారుల పనితీరుకు నిలువుటద్దం.ప్రభుత్వ కార్యక్రమంకే ఇలా ఉంటే,ఇక సామాన్యుల పట్ల ఈ మండల అధికారులు ప్రవర్తించే తీరు అర్ధం చేసుకోగలరు. స్థానిక ఎంపీటీసీ ఐన ఎంపీపీ పద్మప్రియ గైర్హాజరు( జిజిఎంపికి కూడా హాజరు కాలేదు) ఇందిరానగర్ సర్పంచ్ సల్లా వీరభద్రయ్య, ముస్లింపాలెం సర్పంచ్ అబ్దుల్ మజీద్ మల్లంగ్,(ఇద్దరు సర్పంచ్లు),పంచాయతీ వార్డు సభ్యులు,వాలంటీర్లు,గృహసారధులు,వైసిపీ నాయకులు,జగనన్న అభిమానులు,సంక్షేమ పధకాల లబ్ధిదారులు అందరూ కలిపి సుమారు 3500 పైగా ఉన్న సచివాలయంలో 70 మందికి దాటలేదు అంటే ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలలోనికి తీసుకెళ్లాడానికి అధికారులు చేస్తున్న కృషికి అద్దం పడుతుంది.ఇందుకు జగనన్న పేదలందరికి ఇళ్ళు పథకమే నిదర్శనం.సరైన స్థలం నిర్ణయంలో అప్పటి రెవిన్యూ అధికారులు, ప్రస్తుత నాయకుల పనితీరుతో ప్రజలు విసిగిపోయారేమో అనిపిస్తుంది.వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇందిరానగర్ వార్డు సచివాలయ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం అందించిన లబ్ధి..ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటీ) జగనన్న అమ్మ ఒడి 366 మందికి 1,64,62,000/-, జగనన్న విద్యా దీవెన 217 మందికి67,97,886/-, జగనన్న వసతి దీవెన 175 మందికి 27,07,662/-, వైయస్సార్ రైతు భరోసా 242 మందికి 1,15,90,150/-, డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల భీమా కు లేరు, వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు 46మందికి,81,131/-, రైతులకు ఇన్పుట్ సబ్సిడి లేరు -వైయస్సార్ పెన్షన్ కానుక 426 మందికి 3,98,70,000/-, వైయస్సార్ చేయూత 254 మందికి 1,11,93,750/-, వైయస్సార్ ఆసరా 398 మందికి 1,29,81,021/-, వైయస్సార్ సున్నా వడ్డీ స్వయం సహాయ సంఘాలకు 589 మందికి 28,67,922/-, వైయస్సార్ కాపు నేస్తం లేరు, వైయస్సార్ ఈ బీసీ నేస్తం 28 మందికి 7,50,000/-, వైయస్సార్ కళ్యాణమస్తు / షాది తుఫా ఇద్దరికి రికి లక్ష యాభై వేలు రూపాయలు, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ 107 మందికి 44,27,062/-, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య ఆసరా 66 మందికి 3,87,650/-, గృహ నిర్మాణము 52 మందికి 75,75,231/-, వైయస్సార్ భీమా 8 మందికి 12,60,000/-, వైయస్సార్ వాహన మిత్ర 17 మందికి 3,80,000/-, వైయస్సార్ నేతన్న నేస్తం 16 మందికి 12,48,000/-, జగనన్న చేదోడు 13 మందికి 3,20,000/-, తెల్ల రేషన్ కార్డుల వారికి ప్రత్యేక కోవిడ్ సహాయం815 మందికి 8,15,000/-, జగనన్న తోడు( వడ్డీ) 96 మందికి 49,369/-, ప్రత్యక్ష నగదు బదిలీ12,19,13,834/-, కాగా పరోక్ష ప్రయోజనాలు ఇంటి స్థలాలు 52 మందికి 1,27,92,000/-, జగనన్న విద్యా కానుక 221 మందికి 15,69,542,/-, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు బై జ్యూస్ కంటెంట్ తో కూడిన ట్యాబుల పంపిణీ 28మందికి 3,70,216/-, జగనన్న తోడు (రుణాలు)147మందికి 27,36,993/-, జగనన్న గోరుముద్ద 246 మందికి 24,37,122/-, వైయస్సార్ సంపూర్ణ పోషణ 240మందికి 44,95,200/-, ఇంటింటికి రేషన్ 902 మందికి 1,97,03,288/-,పరోక్ష ప్రయోజనాల మొత్తం 4,41,04,361/-, అయింది.
ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రయోజనాల మొత్తం16,60,18,195/-,విదేశీ విద్యా దీవెన ,వైయస్సార్ మత్స్యకార భరోసా,వైఎస్సార్ ఉచిత పంటల బీమా వైఎస్సార్ కాపు నేస్తం ,వైయస్సార్ కంటి వెలుగులకు లబ్ధిదారులు లేరు. పై పథకాలాన్ని అర్హులైన అందరూ అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములకు అవ్వదాతలకు పారదర్శకంగా లంచాలకు వివక్షకు తావు లేకుండా అందించడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పధకాలకు సంబందించిన సహాయం, పిర్యాదుల కొఱకు జగనన్నకు చెబుదాం 1902 కు తెలియపరచవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్వర్లు,మండల వైసిపీ కన్వినర్ దయాకర్ రెడ్డి,దామోదర్ రెడ్డి, జె సి ఎస్ కన్వినర్ చిన్న, సర్పంచ్ రమణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి,నరేంద్ర,అబ్దుల్,అధికారులు ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం రాజు,మురళీ రెడ్డి,సచివాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article