Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుజగన్ రెడ్డి వదిలింది దగా డిఎస్సి

జగన్ రెడ్డి వదిలింది దగా డిఎస్సి

టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్

కడప సిటీ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలింది మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగ దగాడి ఎస్సీ అని టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ మండిపడ్డారు. హరి టవర్స్ లో శనివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 50, 892 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 6 100 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం లో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ రానున్నడంతో, నిరుద్యోగులను మరోమారు మోసం చేసే అందుకు జగన్ సిద్ధమయ్యారని ఆయన అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక 17 45 మంది రాష్ట్రంలో బలన్మర్రణానికి పాల్పడ్డారని చెప్పారు. రాష్ట్రాన్ని మద్యం, గంజాయి కి కేరాఫ్ గా మార్చారని, అందుకు నిదర్శనం పోలీసులు గంజాయితో పట్టుబడటమే అన్నారు. గంజాయి మాఫియా కు వైసిపి బడా నేతలకు సంబంధాలు ఉన్నాయని, గంజాయి పై రాబడి తాడేపల్లి కి చేరుతుందని అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక, జీవనోపాధి దొరకగా తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారని దీనికి కారణం వైసీపీ ప్రభుత్వమే అన్నారు. జగన్ రెడ్డి సభ కోసం ఇంటర్ పరీక్షలనే వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసిపి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు నూకలు చెల్లిస్తారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి మీడియా కోఆర్డినేటర్ జనార్ధన్, బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు, ఈశ్వరయ్య, కాసిం, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article