రాప్తాడు;
మండల కేంద్రంలోని స్థానిక తెదేపా కార్యాలయంలో నేడు తెదేపా పార్టీ ఆధ్వర్యంలో జరిగే జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెదేపా మండల కన్వీనర్ పంపు కొండప్ప మండల తెదేపా నాయకులకు పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నేనని అలాంటి తెదేపా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెదేపా కార్యకర్త పైన ఉన్నదని అందుకోసం జయహో బిసి కార్యక్రమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పరిటాల సునీత హాజరవుతారని మండలంలోని ప్రతి ఒక్క తెదేపా కార్యకర్త బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు .