పోరుమామిళ్ల:
కడప జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులుగా పోరుమామిళ్లకు చెందిన పెసల నరసింహులు, తులసి సుధాకర్, గాజులపల్లె శ్రీనివాసులు, మంజునాథ సుధాకర్, మాలపాటి సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకోవడం జరిగిందన్నా. పెసల నరసింహులను వరుసగా పదోసారి ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈయన ప్రస్తుతం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఛైర్మన్ గా ఉన్నారు. అలాగే తులసి సుధాకర్ వరుసగా ఐదవ సారి ఆర్యవైశ్య జిల్లా ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవం అయ్యాడు ఈయన పట్టణంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే గాజులపల్లె శ్రీనివాసులు పోరుమామిళ్ల ఆర్యవైశ్య దేవస్థానం అధ్యక్షులుగా ఉన్నారు. మంజునాథ సుధాకర్ పోరుమామిళ్ల సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకుడిగా ఉన్నారు. మీరు ఐదు మంది జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవం కావడం పట్ల పోరుమామిళ్ల ఆర్యవైశ్యులు ప్రముఖులు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.