నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి
విశాఖపట్నం:
నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయి సంఘం ఆమోదం తెలిపిందని స్థాయి సంఘం చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని స్థాయి సంఘం సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశం నర్వహించారు.ఈ సందర్భం గా స్థాయి సంఘం చైర్ పర్సన్ మాట్లాడుతూ స్థాయి సంఘంలో 136 అజెండాలతోపాటు 51 టేబుల్ అజెండాలు తో కలిపి మొత్తం 187 అంశాలు పొందుపరిచారని వీటిని స్థాయి సంఘం సభ్యులు చర్చించి ఆమోదించారని తెలిపారు. రెవెన్యూ విభాగానికి చెందిన లీజులు పొడిగింపు, గుత్తలు, ఆశీలు వసూలకు సంబంధించి, పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి పలు ప్రాంతాలలో భవన నిర్మాణ వ్యర్ధాలు తొలగింపుకు రూ.12.30 లక్షలు, ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించి పలు వార్డులలో తాత్కాలిక పద్ధతిపై అదనపు పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసేందుకు జెసిబి లతో వ్యర్ధాలు తొలగింపు కొరకు రూ 2.23 కోట్లు, అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.47.41 కోట్ల తో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయి సంఘం ఆమోదం తెలిపిందన్నారు.ఈ సమావేశంలో స్థాయి సంఘం సభ్యులతో పాటు పట్టణ ప్రణాళిక అధికారి సురేష్ కుమార్, కార్యదర్శి నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, డిసి(ఆర్) ఎస్.శ్రీనివాస్, జోనల్ కమీషనర్లు కె.కనక మహాలక్ష్మి, విజయలక్ష్మి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవ రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.