కండువా కప్పి ఆహ్వానించిన అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి :- ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. శనివారం చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ చంద్రబాబు పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, మాలమహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నెక్కలి నాగమణి, బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు చల్లా భాస్కర్ రెడ్డి, కె.రామిరెడ్డి, పులివెందుల నియోజకవర్గానికి చెందిన చక్రాయపేట మాజీ జెడ్పీటీసీ రాధాకృష్ణయ్య, వేంపల్లికి చెందిన జయరామరెడ్డి, పొద్దుటూరు 19వ వార్డు కౌన్సిలర్ షేక్.మునీర్, మాజీ కౌన్సిలర్ గంజికుంట ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ రామనాథుల భాస్కర్, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎంపీటీసీ కుర్రి శ్రీనివాసు, 10 వార్డు సభ్యులు కుర్రి నాగబాబు, జీడీ నెల్లూరు నియోజకవర్గం నుండి సర్పంచ్ ఏ.గోవిందస్వామితో పాటు ఆయా నియోజకవర్గాల నుండి పెద్దఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు.