విజయ్ మరో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు .. ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి పాన్ ఇండియా సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య. ఆయన ఓ స్టార్ డైరెక్టర్ తో విజయ్ ను కలుసుకుని కథను వినిపించడం … ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నారని వినికిడి. అయితే మరో వైపున రాజకీయాల దిశగా విజయ్ వేస్తున్న అడుగుల కారణంగా, ఆయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొంత సందిగ్ధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎంత వేగంగా ముందుకు వెళుతుందనేది చూడాలి.