Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్" డేరింగ్ స్టెప్ తీసుకుంటున్న డింపుల్ - ఈ విషయంలో నో కాంప్రమైజ్...

” డేరింగ్ స్టెప్ తీసుకుంటున్న డింపుల్ – ఈ విషయంలో నో కాంప్రమైజ్ “

గత కొద్దీ రోజులుగా గ్లామర్ హీరోయిన్ డింపుల్ హయతి పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది . సినిమా హిట్ అయితే మంచి పేరు వస్తుంది , అలానే సినిమా లో యాక్టింగ్ బాగుంటే ప్రేక్షకుల దగ్గర నుండి బెస్ట్ కాంప్లీమెంట్స్ వస్తాయి , ఇవన్నీ కాకుండా హీరోయిన్ డింపుల్ హయతి అసలు ఎందుకు వార్తల్లోకి వచ్చింది ,? ఈ ఖిలాడీ భామ పై సోషల్ మీడియా లో ఎందుకు ఇంత ట్రోలింగ్స్ జరుగుతున్నాయి ? తన పోలీస్ స్టేషన్ లోకి అడుగు పెట్టడానికి గల కారణాలు ఏమిటో పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీ చూడాలసిందే ..

డీసీపీ వర్సెస్‌ డింపుల్‌…. ఇప్పుడిదే టాలీవుడ్ అండ్ ఖాకీవుడ్‌లో కాక రేపుతోంది. పార్కింగ్‌ ప్లేస్‌ విషయమై చెలరేగిన వివాదంలో.. గంటకో ట్విస్ట్‌ తెరపైకి వస్తోంది. పంతాలు పట్టింపులు మధ్య అధికార వేధింపులతో మొదలైన ఈ లొల్లి లో… వ్యక్తిగత ఆరోపణలు కూడా చాలా వరకు ముందుకు వస్తున్నాయి. ఇక రోడ్డుపై ఉండాల్సిన ట్రాఫిక్‌ దిమ్మెలు అపార్ట్‌మెంట్‌లో ఉండటంపై విమర్శలూ వెల్లువెత్తాయి.

హీరోయిన్ డింపుల్ వర్సెస్‌ డీసీపీ మధ్య పార్కింగ్‌ వివాదంలో ఎవరూ తగ్గటలేదు ,ఇక వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు .
అలా ఈ చిన్న గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఇక చివరికి ఈ గొడవ కాస్త పెద్దది అవ్వడంతో పోలీస్ స్టేషన్‌కు చేరింది. మరో అడుగు ముందుకేసిన డింపుల్‌.. డీసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనను వేధిస్తున్నారని న్యాయపోరాటానికి సిద్ధమైంది. పార్కింగ్‌ ప్లేస్‌ కేంద్రంగా చెలరేగిన ఈ ఘర్షణలో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా డింపుల్ మీద పెట్టిన FIR కాపీ అందిందని ఆమె తరఫు లాయర్ పాల్‌ సత్యనారాయణ తెలిపారు. . ఈ కేసులో ఇప్పటి వరకు డీసీపీ మాట్లాడారు కానీ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడటం లేదని డింపుల్ లాయర్ ప్రశ్నించారు. తనను తాను కాపాడుకునేందుకు డీసీపీ డ్రైవర్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు.

డీసీపీ… డింపుల్‌తో మిస్ బిహేవ్ చేశారని.. ప్రస్తుతం ఆమె డిప్రెషన్‌లో ఉందన్నారు. డింపుల్ మీద కావాలని ఆరోపణలు చేయిస్తున్నారని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి వద్ద సంచరిస్తున్నారని పేర్కొన్నారు. తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయని.. నటి డింపుల్‌కు ప్రాణ హాని ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు అని డింపుల్ లాయర్ తెలియజేసారు .

జూబ్లీహిల్స్‌లోని ఎస్‌కే ఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈనెల 14న డింపుల్ హయతి, తన స్నేహితుడు డేవిడ్… పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని ఢీకొట్టిన డీసీపీ డ్రైవర్ కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా కారుని కాలితో తన్నారని ఆరోపించాడు. డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్‌ పై సెక్షన్ 353, 341, 279 కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు అని పిలిచి ఆమెను నాలుగు గంటలు స్టేషన్‌లోనే కూర్చోబెట్టినట్లు చెబుతున్నారు. అదే క్రమంలో డీసీపీ‌ రాహుల్‌ డ్రైవర్‌పై కౌంటర్‌ కంప్లైంట్‌ చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది హీరోయిన్ డింపుల్. దీంతో డీసీపీని ఉద్దేశించి హయతి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

ఈ ఇష్యూ పై డీసీపీ మీడియాతో మాట్లాడారు. చాలాసార్లు చెప్పిచూసినా డింపుల్‌ న్యూసెన్స్ ఆగలేదన్నారు..ఇక వాంటెడ్లీ కారు అడ్డు పెడుతూ.. స్టాఫ్‌తో పాటు వాచ్‌మెన్‌తో గొడవపడే వారని డీసీపీ తెలిపారు . ఇక జరిగిన ఘటనపై లీగల్‌ గానే వెళ్తున్నామని… నిజనిజాలు పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తాయన్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. డీసీపీతో గొడవ అనంతరం జూబ్లిహిల్స్ పరిధిలో పలు ఉల్లంఘనల కింద వరుసగా 3 రోజులు డింపుల్ కారుకు ఫైన్స్ పడ్డాయి. డింపుల్ కారుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే చలాన్లు వేశారని మండిపడ్డారు ఆమె ఫ్యాన్స్‌. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై కోర్టును ఆశ్రయించాలని డింపుల్ డిసైడ్ అయ్యారు. ఒక సెలబ్రిటీగా, అమ్మాయిగా.. ఒక పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు డింపుల్ వెనుకాడారు. కానీ ఆయన తీరు ఏమాత్రం సరిగా లేదన్నారు డింపుల్ తరఫు న్యాయవాది. ఇప్పట్లో డింపుల్ వర్సెస్ డీసీపీ గొడవకు ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. మరి కోర్టు ఏం తేలుస్తుందో.. ఎవరి వాదన నెగ్గుతుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article