భూమి పూజ చేసిన రేణిగుంట మండల ఇంఛార్జి పవిత్ర రెడ్డి బియ్యపు
రేణిగుంట
శ్రీపవిత్ర రెడ్డి మాట్లాడుతూ రేణిగుంట టౌన్ లో మెయిన్ రోడ్లు అని పూర్తి చేసాము,ఒకటి రెండు పెండింగ్ ఉన్న రోడ్లు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, ఒక్కపుడు రేణిగుంటకు నీటి సమస్య ఉన్నందున దాని MLA కృషి సహకారంతో ఈరోజు రేణిగుంటకు నీటి సమస్య అనేది లేకుండా చేసామని, రాణిగుంట ను కూడా సుందరంగా తీర్చి దిద్దుతున్నామని దాన్ని కూడా త్వరలోనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందజేస్తున్నారని,ఇందులో కులమతాలు,పార్టీలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందచేస్తున్నారు అని తెలిపారు.మీకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారికి తెలియజేసి తప్పక వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఎంపిపి హరిప్రసాద్ రెడ్డి,వైస్ ఎంపిపి సుజాత,కో ఆప్షన్ మెంబర్ అసాన్ సాహెబ్,పట్టణ అధ్యక్షులు ప్రభాకర్,సర్పంచ్ నగేష్,ఉప సర్పంచ్ ఇర్ఫాన్, తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు రసూల్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు రఫీ,వార్డ్ మెంబర్లు,ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.