తిరుమల భక్తులకు మరో రవాణా మార్గం అందుబాటులోకి రానుంది. కొంత కాలంగా తిరుపతి కేంద్రంగా రవాణా – మౌలిక వసతుల కల్పన పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా రేణిగుంట విమాశ్రయం ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టుగా డెవలప్ అవుతోంది. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆధునిక హంగులు సమకూరుతున్నాయి. ఇప్పుడు తిరుపతి కేంద్రంగా రెండు రోప్ వేల ఏర్పాటుకు డీపీఎర్ లు సిద్దం అవుతున్నాయి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రతిపాదన ఇప్పుడు ఆచరణ రూపంలోకి వస్తోంది. తిరుపతికి మరో మణిహారం:ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుపతికి మరో మణిహారం సిద్దం అవుతోంది. తిరుపతి లో రెండు రోప్ లే నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. దీనికి సంబంధించి తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ తీర్మానం ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దీని పైన రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రెండు రోప్ లే తయారీకి సంబంధించి డీపీఆర్ ల తయారీ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. 2015లో వీటికి సంబంధించి కేంద్రంతో చర్చ జరిగినా..ఆచరణలో ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఇప్పుడు తిరుపతిలో పెరుగుతున్న భక్తుల రద్దీ..వసతుల కల్పనలో భాగంగా రెండు రోప్ వేల ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ లు ఖరారు చేస్తే..సాధ్యమైనంత త్వరగా టెండర్లను పిలుస్తామని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి నిత్యం దాదాపు 2.5 లక్షల మంది పలు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇందుకోసం బస్సులు, రైళ్లు, విమానాలు నిత్యం రద్దీగా ఉంటాయి. తాజాగా రైల్వే స్టేషన్ తో పాటుగా రూ 500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ గా తిరుపతి బస్ స్టేషన్ ను ఆధునీకరిస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన రెండు రోప్ వేలు..తిరుపతి బస్టాండ్ నుంచి అలిపిరికి, మరో లైన్ తిరుపతి బస్టాండ్ ను నుంచి రైల్వే స్టేషన్ కు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. నూతనంగా నిర్మించనున్న బస్టాండ్ పై నుంచి రోప్ వే మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ పక్కనే హెలిపాడ్ ఏర్పాటు చేసిన..అక్కడ నుంచి నేరుగా రోప్ వే మార్గం ద్వారా అలిపికరికి చేరేకొనేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. డీపీఆర్ లు సిద్దం కాగానే:రోప్ వే అందుబాటులోకి వస్తే భక్తులు బస్టాండ్ లో దిగి బస్కెక్కకుండానే రోప్ వే ద్వారా అలిపిరి చేరుకొనే అవకాశం కలుగుతుంది. గతంలో అలిపిరి నుంచి మెట్లమార్గం మీదుగా తిరుమల చేరేలా ఒకటి, శ్రీనివాస మంగాపురం నుంచి అవ్వాచరి కోన మీదుగా తిరుమల చేరేలా రెండో రోప్ వే ఏర్పాటు పైన ప్రకటనలు చేసారు. కానీ, అమలు కాలేదు.మెట్ల మార్గం మీదుగా రోప్ వే ఏర్పాటు చేస్తే ఆలయాలపై వెళ్లినట్లు అవుతుందని కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు రోప్ వే అందుబాటులోకి వస్తే యాత్రికుల రవాణా సమయం కలిసి రావటంతో పాటుగా తిరుపతి – తిరుమల మధ్య ప్రయాణం ఆహ్లాదకరంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.