Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుతెలుగు రాష్ట్రాలకు తప్పని వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు తప్పని వర్షాలు

మరో రెండు రోజులు వర్షాలే.. వర్షాలు..
ప్రజాభూమి ప్రతినిధి,హైదరాబాద్‌

                తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.నష్టపోయిన పంటను చూసి కన్నీరు పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. విదర్భ నుండి తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని, ఈ క్రమంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 8వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది.తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు ఆగమయ్యాయి. ఈ నేపథ్యంలో తడిసిన ప్రతీ గింజ కొంటామని, రైతులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్‌ భరోసానిచ్చారు. అయితే, ఏపీలో ఇన్‌పుట్‌ సబ్సీడీ ఇచ్చే ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు.ఇదిలాఉంటే.. తమిళనాడులో వర్ష బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉరుములతో కూడిన వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. చెన్నై, కోయంబత్తూర్‌, నీలగిరి, విరుదునగర్‌, మదురై జిల్లాల్లో ఎడతెరిపిలేని వాన కురుస్తుండగా.. నామక్కల్‌, మదురై జిల్లాలో పలుప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article