జగనన్న కోసం రెండు బటన్లు నొక్కండని విజ్ఞప్తి చేసిన హర్షిత్ రెడ్డి.. చంద్రగిరి: చంద్రగిరి మండలం, తొండవాడగ్రామ పంచాయతి అంబేద్కర్ కాలనీ, జగజీవన్ రావు కాలనీ, కట్టమీద ఇండ్లు, ఇందిరమ్మ కాలనీ, అగ్రహారం, విష్ణునగర్ ప్రాంతాల్లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రతి ఇంటా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. ఒక ఇంట అమ్మ ఒడి వస్తే, మరో ఇంట రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ప్రతి ఇంట ఆసరా, చేదోడు లాంటి కార్యక్రమాలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరించాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 125 సార్లు బటన్ నొక్కి రకరకాల సంక్షేమ పథకాల ద్వారా కోట్ల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేశారని, అలాంటి జగన్ మోహన్ రెడ్డి కోసం రానున్న ఎన్నికల్లో రెండు సార్లు బటన్ నొక్కి ఆదరించాలని కోరారు. ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికల తరువాత కూడా తమ కుటుంబం ప్రజలతోనే ఉందని, ఇప్పుడు ఎవరెవరో వచ్చి 50 రోజుల్లో గెలిచేస్తాం, ఏదేదో చేసేస్తాం అంటూ కల్లబొల్లి మాటలు చెప్పుతున్నారన్నారు. అందరూ ఒక్కసారి ఆలోచించాలని, కోవిడ్ సమయంలో వీరందరూ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తొండవాడ సమీపంలోని ఆనందయ్య ముందును తయారుచేసి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి పంచామని, ఎంతోమంది ప్రాణాలను కాపాడమని ఆయన వెల్లడించారు. కష్టమొచ్చినా.. పండగొచ్చినా.. సంతోషమైన.. దుఃఖమైనా… చంద్రగిరి ప్రజలకు అండగా ఉండేది ఒక చెవిరెడ్డి కుటుంబమేనని స్పష్టం చేశారు. 220 మంది లబ్ది దారులకు ఇంటిపట్టాలు.. చంద్రగిరి మండలం ఒక్క తొండవాడ పంచాయతీలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 220 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేసిందని యువ నాయకుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి గ్రామంలో పది మందికో, 20 మందికో ఇంటి స్థలాలు ఇస్తారని, కానీ తొండవాడలో మాత్రం ఏ ఒక్క లబ్ధిదారులు మిగిలిపోకూడదనే ఉద్దేశంతో 220 మందికి ఇంటి స్థలాలు మంజూరు చేసి జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు చేసుకున్నారన్నారు. అలాంటి జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని, మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంలో ప్రతి ఇంట ప్రజలు మీరు చేసిన మేలు ఎవరు మరిచిపోరు చెవిరెడ్డివంటి నాయకున్ని ఎవరు వదులుకోరు అంటూ తొండవాడ ప్రజలు తమ ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన చెవిరెడ్డి హర్షిత రెడ్డి పట్ల ఆత్మీయతను చూపించారు.
వచ్చేఎన్నికలలో మోహిత్ రెడ్డి వెన్నంటి ఉండి ఆదరిస్తామని హర్షిత రెడ్డికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళి రెడ్డి, పార్టీ కన్వీనర్ మస్తాన్, వైస్ ఎంపీపీ నిరంజన్, సర్పంచ్ మల్లం దీపిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.