మార్కాపురం
మార్కాపురం: వైఎస్సార్ సిపి దివ్యాగుల విభాగం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గం అధ్వర్యంలో అలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో అర్హులైన దివ్యాంగులందరికి ఉపకరణలు ఇచ్చే కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వచ్చి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చిర్లంచర్ల కృష్ణ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, ఎంపీపీ అరుణా చెంచీరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షంషీర్ ఆలిభేగ్, ఎమ్పీడివో చందన, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాస్, మార్కెట్ యార్డు డైరెక్టర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.