టాలీవుడ్లో మళ్లీ రిలీజ్
గందరగోళం నెలకొంది. దేవర
, పుష్ప2
వాయిదా వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. సినిమాలు వాయిదా పడటం, వాటి స్థానంలో మరికొన్ని సినిమాలు రావడం తరచూ జరుగుతుంది. ఇటీవల ఆ గందరగోళం ఎక్కువైంది. ఇప్పుడు దేవర
వంతు వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రారంభంలోనే ప్రకటించారు. అయితే ఇటీవల వాయిదా వార్తలు వచ్చిన నేపథ్యంలో టీమ్ ఖండించింది. అదే డేట్‌కి వస్తున్నట్టు తెలిపింది. కానీ ఇప్పుడు మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి. లోక్ సభ ఎన్నికలు, ఏపీ ఎన్నికలు ఏప్రిల్‌లో రాబోతున్నాయనే వార్తలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కాబోతున్నట్టు ఓ సర్క్యూలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఏపీ ఎన్ని కూడా అదే సమయంలో ఉంటాయని అంతా భావిస్తున్నారు. దీంతో రిలీజ్ డేట్లో మార్పులకు వెళ్తున్నట్టు తెలుస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉంటే ఎన్టీఆర్ నటించిన దేవర
మూవీ వాయిదా పడుతుందని భావించారు. టీమ్ నుంచి అలాంటి సందేశమే వచ్చింది. ఇప్పుడు అదే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఆగస్ట్ కి వాయిదా పడుతుందట. స్వాతంత్ర్య దినోత్సం కానుకగా రాబోతుందని అంటున్నారు. కొరటాల శివ రూపొందించిన ఈ మూవీ భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంత డిలే అవుతుందని తెలుస్తుంది. అటు ఎన్నికలు, ఇటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ లో రావాలని భావిస్తున్నారట.
ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ నటిస్తున్న పుష్ప 2
కూడా మరోసారి వాయిదా పడుతుంది. ఈ మూవీ గతేడాదిలోనే వస్తుందని భావించారు. కానీ టీమ్ ఆగస్ట్ 15న రాబోతున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరుని చూస్తుంటే ఇది ఆ సమయానికి పూర్తి కాదని తెలుస్తుంది. ఇంకా ఆలస్యం అవుతుందట. దీంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆగస్ట్ 15 నుంచి తప్పుకుంటుందని, దసరా, దీపావళి, లేదంటే డిసెంబర్లో రాబోతుందని తెలుస్తుంది. దీంతో ఆ ప్లేస్‌కి తారక్ రాబోతున్నారని అంటున్నారు.టిల్లు స్వ్కైర్
ఫిబ్రవరి 9న రావాల్సిన మూవీని వాయిదా వేసుకుంటున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. అయితే కొత్త డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏప్రిల్ 5 నుంచి దేవర
వెళ్లిపోతున్న నేపథ్యంలో ఈ మూవీని ఏప్రిల్ మొదటి వారంలో అంటే, దేవర
డేట్‌కి వేసుకోవాలనుకుంటున్నారట. మార్చి చివరి వారంలోగానీ, లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోగానీ దీన్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. ఇదేకాదు ఇంకా చాలా సినిమాల రిలీజ్ డేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.