నియోజవర్గ కన్వీనర్ విజయరాజు
కామవరపుకోట:దేవుని చిత్తముతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అందుకు ఏ పదవి వచ్చిన ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఏలూరు పీఠాధిపతులు అన్నారు. తడికలపూడి గట్టుమీద ఏర్పాటుచేసిన లోర్దుమాత ఉత్సవాలలో ముగింపు సభలో వైఎస్ఆర్సిపి చింతలపూడి ఇన్చార్జి కంభం విజయ రాజు పాల్గొన్నారు. విజయ రాజును పీఠాధిపతులు దీవించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని దేవుని కృపతో ముందుకు సాగాలని ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదముతో ప్రతి అడుగు వేయగలుగుతున్నానని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఒకే వేదిక పైన ఎంతమంది పీఠాధిపతులు ఆశీర్వదించడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం గా భావిస్తున్నానని అన్నారు. మా తల్లిదండ్రులు ఇచ్చిన వరంగా ఉందని అన్నారు. దేవుని కృప మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నట్లయితే మున్ముందు ముందుకు వెళతానని ప్రజలకు సేవ చేయగలుగుతానని ఆయన అన్నారు.
నిన్న రాత్రి జరిగినటువంటి తడికలపూడి గ్రామంలో లూర్తుమాత మహోత్సవలలో పాల్గొని పీఠాధిపతులు ఆశీర్వాదం తీసుకున్న నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కడిమి రమేష్ , సర్పంచ్ కొత్తపల్లి రజనీ శ్రీనివాస్ , సొసైటీ అధ్యక్షులు గంగుల కాశీ , వైఎస్ఆర్ సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.