చట్టసభల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి పురుషుని చూపు మారితేనే మహిళా వికాసం ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా!!
కడప సిటీ :మానవసమాజంఈసంస్కృతిలో స్త్రీ జాతికి పురుషులతో సమున్నత స్థానం కల్పిస్తుందో ఆ సమాజం, ఆ సంస్కృతి ఆ జాతి అభివృద్ధి పథంలో ముందుంటుంది అని ఆప్ కి అవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా తెలియజేశారు. శుక్రవారం ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆ కమిటీ కన్వీనర్ హమీద్ దాఖనం ఆధ్వర్యంలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆప్ కి అవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ భాష హాజరై ఆయన మాట్లాడుతూ,ఏ సమాజం, ఏ సంస్కృతి ఏ జాతి స్త్రీకి సమున్నత స్థానం కల్పిస్తుందో ఆ సమాజం, ఆ సంస్కృతి ఆ జాతి అభివృద్ధి పథంలో ముందుంటుందని ఆయన తెలియజేశారు.
చట్టసభల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కావాలని ఎన్నో ఏండ్ల నుంచి గొంతెత్తి ఘోషిస్తుంది మహిళా లోకం. నేటికి పాలకులు కరుణించి ఐదేండ్ల తర్వాత మూడోవంతు ప్రాతినిధ్యం కల్పిస్తాం అని సెలవిచ్చారు. కానీ ఐదేండ్లు ఆగాలని ప్రకటించటం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అసలు ఎందుకు ఐదేళ్లు ఆగాలనే దానికి ఎవరివద్దా సమాధానం లేదు అన్నారు. ఏ దేశంలోనైనా జనాభాలో సగభాగమైన స్త్రీలు వారిలోని ఉత్పాదక శక్తిని వినియోగించే అవకాశం ఉంటేనే కదా సమాజం అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించి ముందుకువెళ్తుంది. అలాంటి వాతావరణం కలగచేయవలసిన బాధ్యత సమాజం మీద ప్రభుత్వాల మీద ఉంటుంది. స్త్రీ మొహంలో చిరునవ్వు ఉంటే తన ఇంట్లో సంతోషం ఉన్నట్టు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే తన ఇల్లు ఆరోగ్యంగా ఉన్నట్టు. స్త్రీ చేతిలో ధనం ఉంటే ఆ ఇంట్లో ధనం ఉన్నట్టు. స్త్రీ చేతిలో ఉండేది ఏదైనా కుటుంబంలోని ప్రతిమనిషికీఅందుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు అని ఆయన అన్నారు. మధ్య తరగతి ఇండ్లలో చాకిరిచేసే స్త్రీకి ఆ ఇళ్లవారు తినమని ఏమైనా ఇస్తే ముందు పిల్లలకు, ఆ తర్వాత పెనిమిటికి పెట్టగా మిగిలితేనే తాను నోట్లో వేసుకుంటుంది గాని, తానే ముందు తినదు, ఆమె ఎంత ఆకలి మీద ఉన్నప్పటికీ! అది స్త్రీకి సహజంగా అబ్బే త్యాగరి తి. కొన్ని సందర్భాలలో లైంగిక వేధింపుల కారణంగా మహిళలు ఉపాధి దిశగా, ఆర్థిక సాధికారత దిశగా బలంగా అడుగులు వేయలేకపోతున్నారుఅన్నిట్లో మహిళలు చైతన్యవంతులైనప్పుడే ఈ దేశ ప్రగతి శశశ్యామలంగా ముందుకు వెళుతుందని అలా ముందుకు పోయినప్పుడే మహిళలు అభివృద్ధి జరుగుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కమిటీ సభ్యులు కరీముల్ చాంద్ బేగం ఆప్ కి ఆవాజ్ నగర కన్వినింగ్ కమిటీ సభ్యులు ఫాతిమూన్ మెహనూరు రిజ్వానా భాను ఆప్ కి ఆవాజ్ నగర అధ్యక్షులు అబిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.