వ్యక్తికి తీవ్ర గాయాలు
లేపాక్షి: మండల పరిధిలోని గొంగటి పల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలకు గురైనట్లు లేపాక్షి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే టాటా ఏసీఈ వాటర్ ట్యాంకర్ లేపాక్షి నుండి దేమకేతే పల్లి వైపు వెళుతోంది. ఆ సమయంలో సోమిరెడ్డిపల్లికి చెందిన నాగరాజు ద్విచక్ర వాహనంలో రహదారి వైపు గమనించకుండా జాతీయ రహదారిపై వచ్చారు. అప్పటికే అతి సమీపానికి చేరుకున్న వాటర్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు రెండు కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే ఉన్నాది వివాహం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద బాధితుడిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లేపాక్షి పోలీసులు తెలిపారు.