రేణిగుంట పోలీస్ స్టేషన్ నందు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…
ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్…
సుమారు 20 లక్షల 15 వేల రూపాయలు విలువగల 41 మోటార్ సైకిల్ స్వాధీనం..
ఇద్దరు ముద్దాయిలు కోడూరు వాసులే..
ఇటీవల కాలంలో తరచుగా ద్విచక్ర వాహనాల దొంగతనాల పెరగడంతో ఆ ముద్దాయిని వెంటనే అరెస్టు చేసి దొంగతనం చేయబడిన మోటార్ సైకిల్ ను రికవరీ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో…
రేణిగుంట డీఎస్పీ భవ్య కిషోర్ పర్యవేక్షణలో రేణిగుంట పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారెడ్డి మరియు ఐడి పార్టీ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రేణిగుంట రైల్వే స్టేషన్ పార్కింగ్ ఏరియాలో మరియు యాత్రికులు రద్దీగా ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో అనుమానుతుల కదలికలపై నిఘా పెట్టిన రేణిగుంట పోలీసులు…
ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేసే క్రమంలో ఈ రోజున రేణిగుంట రైల్వే స్టేషన్ వేణుగోపాలపురం క్రాస్ వద్ద ముద్దాయిలను గుర్తించి అదుపులో తీసుకొన్నారు.
వీరు రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 13 మోటార్ సైకిళ్ళు, తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మోటార్ సైకిల్ ను మరియు కోడూరు తదితర ప్రాంతాలలో ముద్దాయిలు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడ్డారు.
వీరి వద్దనుండి సుమారు 20 లక్షల 15000 రూపాయలువిలువగల 41 మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
రేణిగుంట రైల్వే స్టేషన్ అలిపిర పార్కింగ్ ఏరియా కోడూరు పట్టణం ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్మడమే వీరి నేరవృత్తి..
ఏ వన్ ఏ టు ముద్దాయిలు ఇద్దరు కోడూరు పట్టణ వాసులైన పాత నేరస్తులు..
a3 కరీం పాత నేరస్థుడు తమిళనాడు వాసి..
పట్టుబడిన ముద్దాయిలను అందరూ మద్యం ఇతర చెడు వ్యసనాలు అలవాటు పడి ముద్దాయిలు కలిసి దొంగతనాలకు పాల్పడేవారు..
ఉత్తమ ప్రతిభ కనబరిచిన రేణిగుంట డిఎస్పి భవ్య కిషోర్ని, మరియు రేణిగుంట పట్టణ సీఐ సుబ్బారెడ్డిని పోలీసులను జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.