Wednesday, April 23, 2025

Creating liberating content

Uncategorizedనరసింగాపురం రైల్వే కాలనీలోగడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో చెవిరెడ్డి హర్షిత రెడ్డి..!

నరసింగాపురం రైల్వే కాలనీలోగడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో చెవిరెడ్డి హర్షిత రెడ్డి..!

చంద్రగిరి
‘‘జగనన్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన అభివృద్ధి పనుల పట్ల గడప గడపలో ప్రజలకు చెవిరెడ్డి హర్షిత రెడ్డి వెల్లడించారు.
చంద్రగిరి మండలం నరసింగాపురం పంచాయతీ పరిధిలోని రైల్వే కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మంగళవారం నిర్వహించారు. ముందుగా గ్రామ దేవతలకు పూజ చేసిన తరువాత ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారుల సంక్షేమ జాబితాను అందించారు. ఆ తర్వాత గ్రామంలో చేసిన ప్రగతి పనులను వివరిస్తూ ఇంకా ఏదేనీ చేయాల్సిన పనులు ఉంటే వాటిని పుస్తకంలో రాసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. చంద్రగిరి ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి, ఎంపీడీవో బాలాజీ నాయక్ లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని చిన్నపాటి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
అన్నయ్యను గెలిపించండి..
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గడచిన ఐదేళ్లలో చేసిన ప్రగతి పనులు యదావిధిగా కొనసాగాలంటే తన అన్నయ్య చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గ్రామస్తులకు విన్నవించారు. జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో పాటు ప్రగతిపనులను గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని అభ్యర్థించారు. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి చేసిన విజ్నప్తికి ప్రతి ఒక్కరూ తప్పకుండా గెలిపించుకుంటామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
జెడ్ పి టి సి యుగంధర్ రెడ్డి,ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా నాయకులు డివిజన్ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎస్. మస్తాన్, ఎంపీటీసీ అశ్విని ప్రవీణ్ కుమార్, సర్పంచ్ చెంచు రత్నం,చేగు గోవర్ధన గుప్త, ప్రకాష్ రెడ్డి, ఎం.రామ్మూర్తి,హరిప్రసాద్ రెడ్డి, బోస్ చంద్రరెడ్డి,మాధవ రెడ్డి ,ఆర్ ఎస్ మస్తాన్, నాగరాజ, విద్యార్థినాయకుడు సూరి, సిద్ధిక్ భాష, ఏ. రాజశేఖర్ రెడ్డి తో పాటు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article