Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలునా తండ్రి వైఎస్ఆర్.. మరి నేను వైఎస్ షర్మిల ఎలా కాను - ఏపీసీసీ చీఫ్...

నా తండ్రి వైఎస్ఆర్.. మరి నేను వైఎస్ షర్మిల ఎలా కాను – ఏపీసీసీ చీఫ్ షర్మిల

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని అన్నారు. నియంతల్లా మారిన రీజనల్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదని ఆరోపించారు.
తన గురించి తప్పుగా మాట్లాడుతున్న వైసీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తాను వైఎస్సార్ కుమార్తెను అయినప్పుడు… ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నా కుమారుడికి మా నాన్న రాజశేఖరరెడ్డి ఆయన తండ్రి పేరు వైఎస్ రాజారెడ్డి అని పెట్టుకున్నారు. తనకు కితాబు ఇస్తే తన విలువ ఎక్కువ కాదని, ఎవరో కితాబు ఇవ్వకపోతే తన విలువ తక్కువ కాదని అన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించేందుకే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు.
తనకు ఆత్మీయుడిన నమ్మిన బొండా రాఘవ రెడ్డి కూడా తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిదని .. అవన్నీ ఆరోపణలు నిజం కాదని తాను ప్రమాణం చేయగలనని.. ఈ విషయంలో బొండా ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి…దళితులను చంపి, డోర్ డెలివరీ చేస్తున్నారు. అరాచకాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. దళితులకు గుండు కొట్టించి అవమానిస్తున్నారు.. వీటన్నింటినీ మన రాష్ట్రం చూసిందన్నారు. ఎస్సీలను వేధిస్తూ… అంబేద్కర్ విగ్రహాలు పెడితే ఏం ప్రయోజనమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article