చింతూరు:మండలంలోని నిమ్మలగూడెం గ్రామంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ సహకారంతో తాగు నీటి చేతి పంపు కొరకు రిగ్గు వేశారు. వేసవి నేపథ్యంలో గ్రామంలో నీటి ఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్తులు తమ సొంత పైకంతో తాగునీటి కోసం బోరు వేయించాల్సిందిగా డాక్టర్ జమాల్ ఖాన్ ను కోరారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు జేకే సిటి జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం బోరు కొరకు రిగ్గు వేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ జమాల్ ఖాన్ మాట్లాడారు రిగ్గు పూర్తయిన వెంటనే బోరు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
మనిషికి అను నిత్యం నీరు అవసరం ఉంటుందని, అలాంటి నీరు అందుబాటులో లేకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో,తనకు తెలుసన్నారు. గత 15.సంవత్సరాల క్రితం బోర్లు అందుబాటులో లేకపోవటంతో, తన ఇంటి నుండి గ్రామానికి ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెకె సిటీ ట్రస్ట్ సెక్రటరీ ఎండి ఇమ్రాన్ ఖాన్, నిమ్మలగూడెం గ్రామ పటేల్ మడివి కన్నయ్య, మాజీ సర్పంచ్ సోడే శ్రీనివాసరావు, నాగరాజు, ట్రస్ట్ సభ్యులు సమీర్, ఎస్.కె షాజహాన్ తదితరులు పాల్గొన్నారు