ఏలేశ్వరం:-
ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించాలంటూ ఉమ్మడి వెంకటరావు విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో కాంగ్రెస్ ఎలక్షన్ అధికారి సురేష్,కు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ఉమ్మిడి వెంకటరావు మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ ఎం ఎం పల్లం రాజు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీ వైయస్ షర్మిల రెడ్డి ,కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు , కాకినాడ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ మల్లిపూడి శ్రీ రామచంద్ర మూర్తి ( రాంబాబు) ఆశీస్సులతో 2024 లో జరగబోవు శాసనసభ ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ పార్టీ (ఐ ఎన్ సి) అసెంబ్లీ అభ్యర్థిగా రెండవసారి విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నందు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి సురేష్ మరియు పిఎన్ఆర్ కి ప్రత్తిపాడు నియోజకవర్గంలో అప్లికేషన్ దరఖాస్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోయేటి సూర్య ప్రకాష్ రావు, రాష్ట్ర బీసీ సెల్ కోఆర్డినేటర్ కొల్లు వీర గణేష్, కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొప్పన కోటేశ్వరరావు , ప్రతిపాడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎనుమల రాజా, ప్రతిపాడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిడ్డి రాజబాబు గారు ,సమన్వయ కమిటీ మెంబర్ పోతాబత్తులు పెదబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తదితరులున్నారు.