పులివెందుల టౌన్
రాష్ట్రంలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి,చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ లు అన్నారు. బుధవారం స్థానిక భాకరాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు చే వైయస్ మనోహర్ రెడ్డి, వరప్రసాద్ లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఇంటి వద్దనే వైద్యం అందాలనే సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు కూడా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది స్పర్శ కుష్ఠువ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించి కుష్టు వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శాంతి కుమార్, డిపిఎమ్ఓ సుబ్బారెడ్డి, ఎంపీహెచ్ఈఓ సతీష్, కౌన్సిలర్లు కిషోర్, రాజశేఖర్, కోఆప్షన్ నెంబర్ చంద్రమౌళి, వైకాపా నాయకులు డేరంగుల చంద్రమౌళి, వెంకటసుబ్బయ్య టౌన్ ప్లానింగ్ అధికారి అజయ్ కుమార్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైకాపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.