కోట- జలపవారి గూడెం రహదారికి మోక్షం!
మద్ది చైర్మన్ కేసరి సరితా విజయ భాస్కర రెడ్డి
ప్రజా భూమి కామవరపుకోట
అంకాలంపాడు పంచాయతీలో గడిచిన నాలుగు సంవత్సరాలలో పు నేరుగా 23 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు నేరుగా అందజేశామని ఆమె అన్నారు.
కామవరపుకోట నుండి జలపవారిగూడెం మీదుగా కేస్ రామవరం పనులకు సంబందించిన నిధులు విడుదల చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి జి.ఓ విడుదల చేసారని. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని మద్ది చైర్మన్ కేసరి సరితా విజయ భాస్కర రెడ్డి అన్నారు. అంకాలంపాడు సచివాలయపరిధిలో ” వై నీడ్ జగన్ ” కార్యక్రమము అనంతరం స్వగృహం వద్ద కార్యకర్తలతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రాష్ట్రము లో 175 సీట్లతో సీఎం గా జగన్ మోహన రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని కార్యకర్తలు అంతా గట్టిగ కృషి చేసి కేవీబీర్ ఆశయాలు నెరవేర్చేవిధంగా కృషి చేయాలనీ, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. ఈ సందర్భముగా సంక్షేమ పధకాల ద్వారా ఒక అంకాలంపాడు పంచాయతీకి గడిచిన 4 సంవత్సరాలలో 23 కోట్లు నేరుగా ఖాతాలలో జమచేయటమంటే సామాన్య విషయం కాదని, ఇవి ప్రజలకు అర్ధమయేటట్టు వివరించాలని , ఇక నుంచి తరచూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు అభిమానులు పాల్గొన్నారు.