దళితుడే ముఖ్యమంత్రి…
రేసులో దామోదర రాజనర్సింహ, భట్టి
డిప్యూటీ సీఎం గా రేవంత్ రెవెన్యూ లేదా హోమ్
మైనార్టీ శాఖ మంత్రిగా షబ్బీర్ అలీ
ఉత్తమ్ లేదా కోమటిరెడ్డి లో ఒకరికి చాన్స్
పొంగులేటి కూడా మంత్రివర్గ ములోకి
సీతక్క కు క్యాబినెట్ లో చోటు
ఎగ్జిట్ పోల్ ఫలితాల తరువాత కాంగ్రెస్ లో చర్చ
మెజార్టీ వస్తుందన్న ధీమాతో టీ కాంగ్రెస్
(ఏ రామమోహన్ రెడ్డి,సీనియర్ ,పాత్రికేయులు)
అందరూ ఊహించి నట్టుగానే చిన్న చిన్న సంఘటనలు మినహా సాయంత్రం యూ గంటల వరకు క్యూలో ఉన్న ఓటరు శాతం దాడులు 88 శాతం పోలింగ్ జరిగినట్లు అంచనా.ఈ అంచనాల ప్రకారం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కారుకు పూర్తిగా బ్రేకులు వేయగా హస్తం హవ్వా కొనసాగి నట్లుగా ఊహాగానాలు వెళ్ళిడైయ్యాయి.అయితే ఈ ఊహాగానాలు నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ ఎగ్జిట్ పోల్ పై పార్టీల భవితవ్యం ఆధారపడి ఉండక పోవచ్చు. ప్రజానాడీని అంత నిక్కచ్చిగా తెలుసుకోవడం ఇప్పుడు న్న పరిస్థితుల్లో కొంచెం కష్టమనే చెప్పాలి.ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొక రకమైన ఊహాగానాలు జోరందుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పది సంవత్సరాలు అధికారం కోల్పోయి ఆశలు బలమైన ప్రతిపక్ష స్థానాన్ని కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో పోరాటం చేసిన తరువాత తెలంగాణ సమాజం హస్తం ను ఆదరిస్తారని బలమైన నమ్మకం ఏర్పడింది. రేవంత్ రెడ్డి నయకత్వాన్ని జీర్ణించుకోలేని సీనియర్ నాయకులు బహిరంగ విమర్శలు చేసిన చివరికి టికెట్ ల విషయం లో కూడా రేవంత్ రెడ్డికి కొంత నిరాశ ఎదురైందనే వాదన లేకపోలేదు.కర్ణుడి చావుకు అనేక కారనాలు అన్నట్లు చివరికి ఎన్నికల బరిలో దిగి ప్రజాక్షేత్రం లో వీరందరూ తమ అదృష్టాన్ని పరిక్షించు కొనున్నారు.
అయితే అందరు పరీక్షలు రాశారు.ఈ పరీక్షలలో ఎవరు పాస్ అవుతారో లేదో తెలియదు.అప్పుడే పదవుల పందేరం మొదలైనది.అంతర్గతంగా పదవుల పందేరం మొదలై శాఖల పంపకాలు హోదాలు కూడా ఇచుకున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి.ఈ పుకార్లకు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలే అని చెప్పవచ్చు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు కష్ట పడి పార్టీని బ్రతికించేది ఒకరు అయితే అధికారంలోకి రావాలనే పోటీ లో సీనియర్లు, రిజర్వేషన్లు ఇలా అనేక సమస్యలు ఉంటాయి. సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి పేరు వస్తది.ఈ సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో దాపురించి నట్లు మనకే తెలిసిందే.
ఇక పోతే పూర్తిస్థాయి ఫలితాలు ఇంకో మూడు రోజుల్లో రానుండగా కాంగ్రెస్ పార్టీ లో మొదటి నుండి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా మన్న నినాదాన్ని తెరమీదకు తెస్తున్నారు.ఎందుకంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు గా ఉన్న వాస్తవానికి పీసీసీ అధ్యక్షుడే సీఎం స్థానాన్ని భర్తీ చేయాలి. కానీ ప్రచారంలో నే నేను సీఎం నేను సీయం అంటూ చాలామంది నేతలు బహిరంగంగా నే చెప్పు కున్నారు.ఈ నేపద్యము లో రేవంత్ రెడ్డి ఎటు చూసినా సీనియర్లు ఇబ్బంది పెడతారా ని దళిత కార్డ్ తెరమీదకు తెచ్చి దామోదర రాజనర్సింహ ను ఒక వర్గం ప్రతిపాదించడానికి రెడీ అయితే ఇంకొక వర్గం మల్లు భట్టివిక్రమార్కు ను ప్రతిపాదించి సీఎం కుర్చీ సీటు మమ అనిపించుకోవాలని ఇరువర్గాలు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తొంది పూర్తి స్థాయి మెజారిటీ వస్తే. ఇక కాంగ్రెస్ పార్టీ లో బలమైన పోరాటం చేసి పార్టీకి మైలేజ్ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం హోమ్ లేదా రెవెన్యూ ఇచ్చి ,కేసీఆర్ పై సై అంటే సై అన్న పొంగులేటి కి మంత్రి వర్గంలో సముచిత స్థానం ఇచ్చి మిగిలిన వారికి క్యాబినెట్ కూర్పు చేయాలని ప్రదీపాదనలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఓటర్ల నాడీ ఎవరిని ఏ స్థానంలో కూర్చో బెడుతుందో చూడాలి మరి.