పులివెందుల
విద్యార్థులు పరీక్షలను ఆత్మవిశ్వాసం తో వ్రాస్తే విజయం తథ్యం అని,పరీక్షలను పండుగ లాగ సంతోషంగా సానుకూల దృక్పథంతో స్వాగతించా లని జాతీయ సమాచార కార్యదర్శి జన విజ్ఞాన వేదిక సనావుల్లా పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో జన విజ్ఞాన వేదిక అధ్వర్యంలో అవగాహన జనవిజ్ఞాన వేదిక పి.సనావుల్లా,పాఠశాల ప్రధానోపాధ్యాయు లు గంగిరెడ్డి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గంగిరెడ్డి మాట్లాడుతూ జీవితం లో ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని శ్రద్ధ తో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసం తో ,చక్కని ప్రణాళిక తో చదివితే గొప్ప విజయాలను సాధించవచ్చనని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక సమాజ హితమైన గొప్ప కార్యక్రమాలు ఎంతో మంచిదని, పిల్లలకు పరీక్షలపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని వారు అభినందించారు. సనావుల్లా మాట్లాడుతూ పరీక్షలంటే భయం ఎందుకని? విజయం మీదేనని ! పరీక్షలపై ఎటువంటి భయాందోళనలను పెట్టుకోకుండా ఆత్మ విశ్వాసం తో పరీక్షలకు సంసిద్ధం కావాలని,విద్యార్థులకు సూచించారు ఇప్పటి నుండైనా మంచి ప్రణాళిక తో చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని, అన్ని సబ్జెక్ట్ లపైన పూర్తి అవగాహన తో ఇష్టంగా చదివి మంచి మార్కలతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను కోరారు అనంతరం ఎవరు చిన్న చిన్న విషయాలకు, మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులను పట్టించుకోని ఆత్మహత్యల వైపు ఆలోచించకూడ దని,ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంద ని ఆత్మహత్య రహిత సమాజం కోసం ఈ సందర్భం గా ఆయన పాఠశాల విద్యార్థుల చేత ప్రతిజ్ఞను చేపించారు. జన విజ్ఞాన వేదిక నాయకులు యస్.యూనస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.