గ్రామ గ్రామాన బిజెపి ప్రచార కార్యక్రమం
బుట్టాయగూడెం.
పల్లెకు పోదాం ప్రగతిని చాటుదాం అంటూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గావ్ చలో (పల్లెకి పోదాం) పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రారంభించినట్లు బిజెపి పోలవరం నియోజకవర్గం తెలిపారు. మండలంలోని తెల్లంవారిగూడెం, జైనవారిగూడెంలలో శనివారం జరిగిన పల్లెకుపోదాం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి భారతీయ జనతాపార్టీ ఈ దేశానికి, ఆంధ్రప్రదేశ్ కి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ఒకటే దేశానికి సుస్థిరమైన ప్రజా సంక్షేమ పాలనను అందించగలరని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి దేశంలోనూ, రాష్ట్రంలోనూ అభివృద్ధి కొనసాగింపుకు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా, భారతీయ జనతా పార్టీకి నూతనంగా జిల్లా ఇన్చార్జిగా నియమితులైన నరేంద్ర ప్రకాష్, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ, మండల అధ్యక్షుడు దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు వంకా కాంచనమాల, మండల ప్రధాన కార్యదర్శి సోము హరినారాయణ, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పావిల వీరకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.