చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం
ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి
పులివెందుల
పులివెందులలో కోట్ల రూపాయల పాడా నిధులు దుర్వినియోగం చేశారని,ప్రజా సంక్షేమం చంద్రబా బు తోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి అన్నారు.పులివెందుల మున్సిపల్ పరిధిలోని రోటరీ పురం, ఎస్సీ కాలనీ లలో బిటెక్ రవి, ఆయన సతీమణి లతా రెడ్డిలు బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రోటరీ పురానికి బీటెక్ రవి చేరుకోగానే ఆ ఏరియాకి చెందిన జిల్లా పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అక్కుల గారి విజయ్ కుమార్ రెడ్డి గజమాలతో బాణాసంచా పేలుస్తూ పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. అనంత రం ఆయన ప్రజలతో మాట్లాడుతూ సాగునీటితో సాగు చేసే రైతుల యొక్క మోటార్స్ కు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది అని దాని ద్వారా ఒక్కొక్క మీటర్ కి నెలకు 15వేల నుంచి 30 వేల వరకు చార్జెస్ చెల్లించాల్సి వస్తుంది అని అపుడు వ్యవసాయం చేసే రైతు అనే వారే ఉండర న్నారు.ఆ మీటర్ కూడా 6వేలు అయితే కమిషన్ తీసుకొని 15 వేల రూపాయలకు రైతు కొనాల్సి వస్తుంది అన్నారు.ఇలా జగన్ పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గాల వారు కూడా మేలు జరగలేదు అని వారు అన్నారు.వచ్చే ఎన్నికల్లో తెదేపా కు ఓటు వేసి గెలిపించండి మళ్ళీ చంద్రన్న పాలనను తెచ్చుకుందాం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ రూములకు సంబంధించి చాలా గోల్మాల్ జరిగాయ ని, కొంతమంది నాయకులు పేద ప్రజల రేషన్ కార్డులు పెట్టి బిల్లులు చేసుకున్నారని వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన అలాంటి వారికి తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు దృష్టికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తామన్నారుఈ కార్యక్రమం లో మాజీ పట్టణ అధ్యక్షులు మద్దూరి వెంకట్రామి రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు తూగుట్ల మధు సూదన్ రెడ్డి,రాఘవరెడ్డి ,సీనియర్ నాయకులు జోగిరెడ్డీ,పట్టణ అధ్యక్షులు కొరియర్ ప్రసాద్ రెడ్డి, లింగాల మండల ఇంఛార్జి విశ్వనాథ రెడ్డి , జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి బొజ్జ మైసూరా రెడ్డి , వెంకటేశ్వర రెడ్డి, నల్లగారి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు మహబూబ్ బాషా,ఖాసిం వల్లి,రహంతుల్ల, దేవి, రఫీ, జగన్మోహన్ రెడ్డి , రఘు, ఖాసీంబీ, శాంతి కుమారి,శకుంతల టైగర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.