కడప సిటీ
ప్రస్తుతంజరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో బిజెపి ప్రభుత్వ ఆంధ్ర రాష్ట్ర విభజన హామీలను విస్మరించిందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ తెలిపారు.సోమవారం నాడు జిల్లా కార్యాలయం నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాలలో విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్నారు.మొన్న బడ్జెట్ సమావేశాలలో అయిన విభజన హామీలు ప్రత్యేక హోదా,కడప ఉక్కు,రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏ ఒక్కటి అమలు చేయలేదు అన్నారు.గడిచిన ప్రతి పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించిన అంద్రుడుకి ప్రతి సారి మోసం జరుగుతూనే వుంది అన్నారు.హోదా వస్తె పరిశ్రమలు వస్తాయి,రాయితీలు ఇతర సౌకర్యాలు అన్ని లభిస్తాయని అన్నారు.కానీ బిజెపి నాయకులు ఇచ్చిన హామీని మరిచి, హోదా ముగిసిన అధ్యాయమని నక్కజిత్తుల మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.అది ముగిసిన అధ్యాయము కాదని నిత్య సంజీవని అన్నారు.కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని ముగ్గురు ముఖ్యమంత్రులు మారితే మూడు శిలా ఫలకాలు పడిన ఏకైక పరిశ్రమ కడప ఉక్కు కే దక్కింది అన్నారు.శిలా ఫలకాలు వేసినంత త్వరగా పరిశ్రమ ఏర్పాటులో పాలకులకు చిత్తశుద్ది లేదు అన్నారు.కడప ఉక్కు వస్తె వెనుకబడిన రాయలసీమకు నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు.కానీ కేంద్రం లోని బిజెపి ఫీజుభులిటి పేరుతో ఉక్కు పరిశ్రమను అడ్డుకుంటుంది అన్నారు.వెనుకబడిన రాయలసీమకు బుందేల్ ఖాండ్ తరహా ప్యాకేజీ ఏమైంది అన్నారు.పార్లమెంటులో ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీల ఎంపిలు కేంద్రంతో కొట్లాడకుండా, నిలదీయకుండ, సిగ్గులేకుండా రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు అన్నారు.బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు బిజెపి పై ఒక్క ఖండన కూడా చేయకపోవడం ఘోరం అన్నారు.బిజెపి తో రహస్య మైత్రి ఇదే అన్నారు.బయట ప్రజలను మోసం చేస్తున్నారు అన్నారు.రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టిన పార్టీలకు రాబోవు ఎన్నికలలో ప్రజలు ఓటు ద్వారా తగిన భుద్ది చెబుతారు అన్నారు.సమావేశంలో నగర అద్యక్షులు షేక్. షాకీర్ పాల్గొన్నారు.