శంఖవరం: శంఖవరం గ్రామ శివారు కోనేరు చెరువు నుండి బంగారు దొడ్డి మెట్ట సుమారు 2 కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు నిర్మాణానికి శనివారం శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు నిమిత్తం నిత్యం ఈ రోడ్డు లో రైతులు తిరుగుతూ ఉంటారని వారి సౌకర్యార్థం ఎంపీపీ నిధుల నుండి సుమారు 15 లక్షల లతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టం జరిగిందని తెలియజేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైకాపా పార్టీ పని చేస్తుందన్నారు. రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో యువ నాయకులు పర్వత వివేకానంద, ఆచంట వెంకటేశ్వర రావు, పెనుపోతుల శివ, షేక్ నూర్, రైతులు పాల్గొన్నారు.