Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంపూర్ణాహుతితో ముగించిన కోటి పార్దేవలింగ మహా రుద్రాభిషేకం

పూర్ణాహుతితో ముగించిన కోటి పార్దేవలింగ మహా రుద్రాభిషేకం

ముగింపు కార్యక్రమానికి హాజరైన శ్రీ శృంగేరి జగద్గురు కృప పోషిత తుని తపోవన శ్రీ మఠాధిపతులు పూజ్యశ్రీ జగద్గురు పరమహంస శ్రీ సద్గురు సచిదానంద సరస్వతి మహాస్వామి ఏలేరు నదిలో కోటి పార్థివలింగాల నిమజ్జనం కోటి పార్థివలింగాలను దర్శించుకున్న పెద్దాపురం శాసనసభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

జగ్గంపేట :జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు సునీత దంపతులు ఆధ్వర్యంలో కోటిపార్జీవలింగ మహా రుద్రాభిషేకం ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించి గురువారం ఉదయం 8:30 కు పూర్ణాహుతి కార్యక్రమంతో కోటి పార్థివలింగ మహా రుద్రాభిషేకం ముగించారు. ఈ ముగింపు కార్యక్రమానికిహాజరైన శ్రీ శృంగేరి జగద్గురు కృప పోషిత తుని తపోవన శ్రీ మఠాధిపతులు పూజ్యశ్రీ జగద్గురు పరమహంస శ్రీ సద్గురు సచిదానంద సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని కోటిలింగాలను దర్శించుకున్నారు. అనంతరం 11 రోజులుగా మహా రుద్రాభిషేకం అందుకున్న కోటి పార్థివలింగాలను భక్తుల స్వహస్తాలతో ఏలేరు నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని కోటిలింగాలను దర్శించుకున్నారు. చిన్నారులు భరతనాట్యంతో భక్తులను అలరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇంతటి గొప్ప మహా యజ్ఞం చేయడం చాలా కష్టతరమైన పని అని ఆ శివుడి సంకల్పంతో జ్యోతుల నెహ్రూ కుటుంబం శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో నిర్విఘ్నంగా నిర్వహించి ఈరోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని ఈ లింగాలను ఏలేరు నదిలో నిమజ్జనం చేసి ఒక గొప్ప క్షేత్రంగా ఈ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం విరాజిల్లుతుందని స్వామీజీ అన్నారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూజగద్గురు పరమహంస శ్రీ సద్గురు సచిదానంద సరస్వతి మహాస్వామి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆ శివుడు పుట్టినటువంటి మహాశివరాత్రి రోజున వీరు కూడా పుట్టడం ముందుగా వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు ఇమ్మని కోరుతున్నానని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం మా గురువర్యులు శృంగేరి పీఠాధిపతులు దివ్య ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి బ్బూ వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article