Thursday, November 28, 2024

Creating liberating content

Uncategorizedపోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ఏర్పాటు చేయాలి

పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ఏర్పాటు చేయాలి

అధికారుల సమీక్షలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్

హిందూపురం టౌన్
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సెక్టారల్ అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారి అభిషేక్ కుమార్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సెక్టారల్ అధికారులతో పోలింగ్ బూత్ లలో సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతు సెక్టారల్ అధికారులందరు వారి పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ లను పరిశీలన చేసి, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు అన్నింటిని ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పురపాలక సంఘ ఇంచార్జ్ కమిషనర్ సునీల్, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు తహసిల్దార్ లు స్వర్ణలత, బాబు, నాగరాజు, ఎంపీడీఓ నరేంద్ర కుమార్, ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ రెడ్డి శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article