జీలుగుమిల్లి:ఒకటి నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి అనంతరం తగు చుచనాలు సలహాలు డాక్టర్ ఎస్ సాయి దిలీప్ చందు చేశారు. జీలుగుమిల్లి మండలంలోని స్వర్ణ వారి గూడెం పంచాయతీలో గల పాముల వారి గూడెంలో ఐటీడీఏ స్కూల్ ప్రాంగణంలో ఆయన పోలీయె చుక్కలను పిల్లలకు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్ణ వారి గూడెం పంచాయతీ పరిధిలో సున్నా నుండి ఐదు సంవత్సరాలు వరకు ఉన్నటువంటి వారు 45 మంది ఉన్నారని చెప్పారు.డాక్టర్ ఎస్ సాయి దిలీప్ చందు మాట్లాడుతూ చిన్నారుల నిండు ప్రాణాన్ని కాపాడేందుకు ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయని, ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించుకోవటం వలన అంగవైకల్యం రాకుండా పూర్తి ఆరోగ్యంతో ఉంటారు అని నిండు ప్రాణానికి రెండు చుక్కలు అని అన్నారు.పోలియో రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని ఇందులో భాగంగా ఈరోజు మార్చి 3 నా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారని, దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రంలో పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తుంది అనిఈకార్యక్రమం కోసం ఆరోగ్యశాఖ అధికారులు వేల సంఖ్యలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు అని, ప్రజలకు కూడా అందుబాటులో మొబైల్ బూతులు కూడా ఉన్నాయి అని అన్నారు.ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు విధిగా పోలియో బూతుకు వెళ్లి పోలియో చుక్కలు వేయించాలి అని, ప్రయాణంలో ఉన్నా కూడా పోలియో చుక్కలు వేయించుకోవచ్చు అని, ప్రముఖ రైల్వే స్టేషన్లో బస్టాండ్ లో కూడా పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు, మార్చి 3నా ఒకవేల మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే మార్చి 4,5 తేదీల్లో గ్రామాల్లోని ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చి మరీ పిల్లలకు పోలియో చుక్కలు కూడా వేస్తారు అని తెలియచేశారు. విధిగా పిల్లల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.